
- పరిస్థితిని గమనిస్తున్న ఐటీ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: మిడ్, సీనియర్ లెవెల్స్‌కు చెందిన 12 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తామని టీసీఎస్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.
ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఈ విషయంలో ఏమైనా సహాయపడతాయా ? అనే కోణంలో ఆలోచిస్తున్నది. ఐటీ మంత్రిత్వ శాఖ టీసీఎస్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నిర్ణయం వెనుక కారణాలను లోతుగా స్టడీ చేస్తోంది. మరోసారి ట్రెయినింగ్ఇచ్చి ఉద్యోగాన్ని కొనసాగించడం గురించి కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. టీసీఎస్ నిర్ణయంపై కొన్ని ఉద్యోగ సంఘాలు కేంద్ర కార్మికశాఖకు ఫిర్యాదు చేశాయి. ఇదిలా ఉంటే, టీసీఎస్ బాటలోనే మరిన్ని కంపెనీలు ఉద్యోగాలకు కోత పెట్టే అవకాశం ఉందని ఐటీ సెక్టార్ ఎక్స్పర్టులు అంటున్నారు.