మిడిల్ క్లాస్ జయహో వందే భారత్: ఈ రూట్లలో తగ్గిన విమానం టికెట్లు, ట్రాఫిక్

మిడిల్ క్లాస్ జయహో వందే భారత్: ఈ రూట్లలో తగ్గిన విమానం టికెట్లు, ట్రాఫిక్

ఇండియన్ రైల్వే వేగంగా ఆధునీకరించబడుతోంది. ఇందుకు నిదర్శనం..హైస్పీడ్ వందే భారత్ రైళ్లు, నమో భారత్ రైళ్లు..ఇవి ఇండియన్ రైల్వే సామర్థ్యాన్ని మరింత పెంచాయి.  చిన్న ప్రయాణాలకు కూడా విమానాల కోసం ఎదురు చూస్తున్న మధ్య తరగతి ప్రయాణికులకు తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణించేం దుకు వందేభారత్ రైళ్లు ప్రత్యామ్నాయ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. వందే భారత్ రైళ్లు వచ్చాక ఎయిర్ ట్రాఫిక్, విమాన ఛార్జీల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. మధ్యతరగతి, శ్రామిక వర్గాలు వందే భారత్ రైళ్లలో ప్రయాణం ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్  వందే భారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 

ఈ క్రమంలో ఇండియన్ రైల్వేలో వందే భారత్  రైళ్లు ప్రవేశించిన తర్వాత విమాన ప్రయాణాలు గణనీయంగా తగ్గాయి. వందే భారత్ రైళ్లు నడుస్తున్న రూట్లలో దాదాపు 10 నుంచి 20 శాతం వరకు ఎయిర్ ట్రాఫిక్ తగ్గిందని.. దీంతోపాటు 20 నుంచి 30 శాతం విమాన ప్రయాణ టిక్కెట్ ధరలు కూడా తగ్గాయి. 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 34 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. 2019లో న్యూ ఢిల్లీ, వారణాసి మధ్య తొలి వందే భారత్ రైలు ప్రధాని మోదీ ప్రారంభించారు. అది వెంటనే మంచి ఫలితాలను ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లు తీసుకురావాలని  కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రధాన మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రస్తుతం అందుబాటులో తెచ్చింది. 

దేశీయంగా హైస్పీడ్ ట్రైన్స్ నెట్ వర్క్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది తక్కువ దూరం ప్రయాణించేందుకు రైల్వేలను ఎంచుకునేందుకు దోహదం చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మొత్తం 75 వందే భారత్ రైళ్లతో 150 సర్వీస్ లను  నడపాలని ఇండియన్ రైల్వే ప్రణాళికలు సిద్దం చేసుకుంది.  దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగా 2030 వరకు ఈ రైళ్ల  సంఖ్యను 800 సర్వీసులకు నిర్ణయించింది.

ALSO READ:ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలకు లక్ష కోట్ల

దేశం అభివృద్ది, మౌలిక సదుపాయాల పునరుద్దరణ వంటి అంశాలను ప్రధాని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లక్ష్యాలను సాధించే క్రమంలో ఇండియన్ రైల్వే ఆధునీకరణ ఓ ముఖ్యమైన అడుగు.