ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. అమిత్ షాతో చంద్రబాబు భేటీ

 ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. అమిత్ షాతో చంద్రబాబు భేటీ

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు  ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.  2018 లో ఎన్డీఏ నుంచి వైదొలిగాక తొలిసారి అమిత్ షా తో భేటీ   అయ్యారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా కూడా ఉన్నారు. రేపు ( జూన్ 4) ప్రధాని మోడీని కలిసే అవకాశముందని సమాచారం.  ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్‌సై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గత ఎన్నికల తర్వాత ఒకసారి కూడా అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవ్వలేదు. చాలా ఏళ్ల తర్వాత అమిత్ షాతో సమావేశం కానుండటం ఏపీ పాలిటిక్స్‌లో కీలకంగా మారింది. అజాదీ కా అమత్ మహోత్సవ్ ఉత్సవాల సందర్బంగా దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలందరినీ కేంద్రం ఆహ్వానించింది. ఈ సమయంలో చాలాకాలం తర్వాత మోదీ, చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడుకోవడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

 జీ20 సదస్సును కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా పలు విభాగాలు..అంశాల పైన సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో భాగంగానే ప్రధాని, హోం మంత్రితో ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. గతంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నిర్వహణ సమయంలోనే ప్రధాని మోదీ - చంద్రబాబు మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి.

 బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్న సమయంలో ప్రధాని మోడీ, అమిత్ షా తో మాట్లాడే సందర్భంతో చంద్రబాబు రాజకీయంగా ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటారా లేదా అనేది చూడాలి. రేపు మధ్యాహ్నం( జూన్ 4)  చంద్రబాబు తిరిగి హైదరాబాద్ రానున్నారు