
ఇసుక కొరత పై ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆందోళనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ ధర్నాలు నిర్వహిస్తున్నారు తమ్ముళ్లు. విజయవాడ అలంకార్ సెంటర్ లో నిర్వహించిన ధర్నాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాల్గొన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు. జగన్ సర్కార్ నిర్ణయం వల్లే నిర్మాణాలు నిలిచిపోవడంతో తమకు ఉపాధి పోయిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పాలసీ పేరుతో క్వారీలను మూసివేయడం దారుణమన్నారు లోకేశ్. వైసీపీ నేతలు దోచుకునేందుకే కృత్రిమ ఇసుక కొరత సృష్టించారని మండిపడ్డారు. కొత్త పాలసీ తీసుకు వచ్చే వరకు పాత పాలసీని అమలు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.