లీకేజీ నీటితో నిండిన గుంతలో ఈతకొట్టి నిరసన

లీకేజీ నీటితో నిండిన గుంతలో ఈతకొట్టి నిరసన

కరీంనగర్ 48వ డివిజన్ లో మున్సిపల్ వాటర్ లీకేజ్ అవుతోంది. పైప్ లైన్ లీకేజీ నుండి లీకవుతున్న నీటితో చిన్న సైజు కుంట ఏర్పడింది. పట్టణంలో పెద్ద ఎత్తున తాగునీరు వృధాగా పోతున్నా అధికారులు ఎవరూ పట్టించుకో లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. లీకేజీ నీటితో నిండిపోయిన గుంతలో ఈత కొట్టారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల తాగునీళ్లు వృధా అవుతున్నాయని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మండిపడ్డారు.