- జూబ్లీహిల్స్‌లోని బాబు నివాసం వరకు టీడీపీ నేతల ర్యాలీ
హైదరాబాద్, వెలుగు : ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బేగంపేట విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని చంద్రబాబు నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాద్నగరానికి వచ్చిన చంద్రబాబును టీడీపీ నేతలు ఎయిర్‌పోర్ట్ వద్ద గజమాలతో స్వాగతించారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
వర్షంలోనే ర్యాలీ కొనసాగింది. చంద్రబాబు కారులో నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. బాబుకు ఆహ్వానం పలుకుతూ టీడీపీ నేతలు సిటీ అంతా ఫ్లెక్సీలు, కటౌట్‌లు, పసుపు తోరణాలు ఏర్పాటు చేశారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
