27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు

27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఈ నెల 27, 28వ తేదీల్లో ఏపీలోని రాజమండ్రిలో  జరగనున్న మహానాడు వేడుకకు రాష్ట్రంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని రాష్ట్ర టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. 'మహానాడుకు హాజ రయ్యే వారు ముందస్తు సమాచారం అందిం చాలి. రాజమండ్రిలో తెలంగాణ టీటీపీ పార్టీ విభాగానికి చెందిన కౌంటర్లలో తప్పనిసరిగా పేర్లు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిన వారికి అకామిడేషన్, భోజన వస తుల్లో అసౌకర్యం కలగకుండా ఏపీ పార్టీ కార్యాలయ సిబ్బంది చర్యలు తీసుకుంటారు.' అని జ్ఞానేశ్వర్ తెలిపారు. మహానాడు వేడు కల్లో మొదటి రోజైన 27వ తేదిన ప్రతినిధుల సభ, 28న ఎన్టీఆర్ జయంతి, బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. మీటింగ్​లో పోలిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యూరో సభ్యులు  రావుల చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసూన, పుల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్, మహిళా అధ్యక్షురాలు షకీలా రెడ్డి పాల్గొన్నారు