స్టూడెంట్ పై టీచర్ లైంగిక దాడి.. ప్రేమ పేరుతో ట్రాప్.. రహస్యంగా పెండ్లి

స్టూడెంట్ పై టీచర్ లైంగిక దాడి.. ప్రేమ పేరుతో ట్రాప్.. రహస్యంగా పెండ్లి
  •    రిమాండ్​కు పంపిన పోలీసులు

ఘట్‌‌కేసర్, వెలుగు: పదో తరగతి చదువుతున్న ఓ మైనర్‌‌ విద్యార్థినిని మాయమాటలతో మభ్యపెట్టి ప్రేమ పేరుతో దగ్గర చేసుకున్న టీచర్​ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రహస్యంగా పెండ్లి కూడా చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. అన్నోజిగూడలోని ఓ ప్రైవేట్‌‌ స్కూల్‌‌లో పర్రే మైటీన్‌‌(27) అనే యువకుడు ఫిజిక్స్​ టీచర్​గా పనిచేస్తున్నాడు. ఇదే స్కూల్‌‌లో పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నాడు. పలుమార్లు లైంగికంగా వాడుకున్నాడు.

బాలిక మెడలో తాళి గమనించిన తల్లి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపాల్‌‌ను సంప్రదించగా మొదట నిర్లక్ష్యంగా స్పందించినట్లు తెలిసింది. విషయం బయటకు రావడంతో యాజమాన్యమే నిందితుడిని పోలీసులకు అప్పగించింది. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌‌కు తరలించారు. ఘటన పాఠశాల బయట జరిగిందని యాజమాన్యం పేర్కొంటూ, టీచర్‌‌ను విధుల నుంచి తొలగించినట్లు  ప్రకటించింది.