తెలంగాణలో ఆధార్ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులు.. ఇంటర్, డిప్లొమా చేసినోళ్లకు మంచి ఛాన్స్..

తెలంగాణలో ఆధార్ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులు.. ఇంటర్, డిప్లొమా చేసినోళ్లకు మంచి ఛాన్స్..

సీఎస్‌సీ ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్  ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: ఆధార్ సూపర్​వైజర్/ ఆపరేటర్

మొత్తం ఖాళీలు: 6.

జిల్లాల వారీగా ఖాళీలు: యాదాద్రి భువనగరి 1, హైదరాబాద్ 2, నాగర్ కర్నూల్ 1, సూర్యాపేట 1, మేడ్చల్ మల్కాజ్ గిరి 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి/ ఇంటర్మీడియట్ లేదా పదో తరగతితోపాటు ఐటీఐ లేదా పదోతరగతితోపాటు మూడేండ్ల డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. 

యూఐడీఏఐ గుర్తింపు పొందిన  టెస్టింగ్ & సర్టిఫైయింగ్ ఏజెన్సీ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. అభ్యర్థికి కంప్యూటర్ అప్లికేషన్స్​పై పరిజ్ఞానం ఉండాలి. 
ఆధార్ నమోదు/ అప్డేట్ సాఫ్ట్​వేర్, బయోమెట్రిక్ పరికరాలపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. 

వయోపరిమితి: కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి పేర్కొనలేదు. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జూన్ 20. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్,  ఇంటర్వ్యూ లేదా పర్సనల్ ఇంటరాక్షన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థి కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ అప్లికేషన్లపై అవగాహన, ఆధార్ నమోదు/అప్‌డేట్ ప్రక్రియలపై ఉన్న ప్రాథమిక అవగాహనను పరీక్షిస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ csc.gov.inను సదర్శించండి.