కరోనా ఎఫెక్ట్: బతుకుబండి నడపడం కోసం టిఫిన్ బండి నడుపుతున్న టీచర్

కరోనా ఎఫెక్ట్: బతుకుబండి నడపడం కోసం టిఫిన్ బండి నడుపుతున్న టీచర్

కరోనా వల్ల దేశంలో చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అటు ఉద్యోగం లేక.. ఇటు చేతిలో డబ్బులేక చాలామంది ఏ పని చేయడానికైనా సిద్ధపడుతున్నారు. అలా కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయి.. బతుకుబండి నడపడం కోసం టిఫిన్ బండి నడుపుతున్నాడో టీచర్.

ఖమ్మం జిల్లాకు చెందిన మారగాని రాంబాబు అనే వ్యక్తి ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే కరోనా వల్ల రాంబాబు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అసలే టీచర్ గా గౌరవంగా బతికిన వ్యక్తి.. ఇప్పుడు ఒకరి ముందు చేయిచాచి అడగలేడు. అందుకే తాను ఎవరి మీదా ఆధారపడకుండా స్వంతంగా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకున్నాడు. దాంతో తాను ఒక టీచర్ అయినా సరే.. మొహమాటానికి పోకుండా ఒక టిఫిన్ బండిని పెట్టుకొని బతుకుతున్నాడు. రాంబాబుతో పాటు అతని భార్య కూడా టిఫిన్ బండి దగ్గర పనిచేస్తూ అతనికి సహకరిస్తుంది. గౌరవంగా బతకడానికి నిజాయితీగా ఏ పని చేసినా తప్పులేదని ఈ టీచర్ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

For More News..

17వ రోజు కూడా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

హెచ్‌1-బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం

షెల్టర్ హోంలో 57 మంది అమ్మాయిలకు కరోనా.. ఐదుగురు మైనర్లకు ప్రెగ్నెన్సీ