డ్రగ్స్​పై టీచర్లు, పేరెంట్స్​అలెర్ట్​గా ఉండాలి : మంత్రి సీతక్క

డ్రగ్స్​పై టీచర్లు, పేరెంట్స్​అలెర్ట్​గా ఉండాలి : మంత్రి సీతక్క

శాయంపేట, వెలుగు : కొంత మంది తమ వ్యాపారం కోసం పిల్లలకు మత్తు మందులు అలవాటు చేస్తూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అలెర్ట్​గా ఉండాలని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాల గంగాధర్ రాజ్ పదవీ విరమణ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాట్లాడారు. 

పిల్లలకు తొలి ఒడి అమ్మ ఒడి, మలి ఒడి బడి అని అభివర్ణించారు. ములుగు నియోజకవర్గం తిమ్మంపేటకు చెందిన బాలగంగాధర్ రాజ్ 34 ఏండ్లుగా సేవలందించారని కొనియాడారు. తన మేదస్సును నియోజకవర్గ అభివృద్ధికి వినియోగించాలని కోరారు. అనంతరం బాలగంగాధర్ రాజ్ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.  

జబ్బార్ మరణం తీరని లోటు..

ములుగు : జబ్బార్ మరణం తనకు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు మండలం జగ్గన్నపేటలో నిర్వహించిన కొట్టేం వెంకటనారాయణ (జబ్బార్) ప్రథమ వర్ధంతికి మంత్రి సీతక్క హాజరై ఆయన ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటానన్నారు.