బదిలీల విషయంలో  ప్రభుత్వ తీరుపై టీచర్ల ఆగ్రహం

బదిలీల విషయంలో  ప్రభుత్వ తీరుపై టీచర్ల ఆగ్రహం
  • బీఆర్కే భవన్ ముట్టడికి యత్నం
  • అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్: బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన 317 జీవో వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతోందని  వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సర్కార్ తీరును నిరసిస్తూ హైదరాబాద్ బీఆర్కే భవన్ ముట్టడికి యత్నించారు. ఆందోళన చేస్తున్న యూటీఎఫ్,ఇతర లీడర్లు, టీచర్లను అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. జీఓ 317 తో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  ప్రాధ్యాన్యత, సీనియారిటీ ,భార్య భర్తల అప్పీల్ లను వెంటనే  పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతర్  జిల్లా , పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల ఆందోళనలతో బీఆర్కే భవన్ దగ్గర ఉద్రికత ఏర్పడింది.

 

 

ఇవి కూడా చదవండి

మల్లన్నసాగర్ అక్రమాలపై హైకోర్టులో పిటిషన్

పిల్లల దుస్తుల్లో  బంగారం దాచి తీసుకొస్తుంటే..

బంగారు తెలంగాణలో అన్ని చార్జీలు పెరిగినయ్