ప్రభుత్వ విద్యను బతుకనిస్తారా ? లేదా ?

ప్రభుత్వ విద్యను బతుకనిస్తారా ? లేదా ?

హైదరాబాద్ : ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయుల పోరాట కమిటీ (USPC) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మహాధర్నా చేశారు.  జీవో 317తో నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యావలంటీర్లు, పారిశుధ్య నిర్వహణ కార్మికులను నియమించాలన్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు వెంటనే సరఫరా చేయాలని  కోరారు. సాయంత్రం5 గంటల వరకు ధర్నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. 

ఈ పోరాటం కేవలం ఉపాధ్యాయుల కోసం కాదు

ఈసందర్భంగా టీచర్స్ ఎమ్మెల్సీ నర్సి రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బతుకనిస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఇది కేవలం ఉపాధ్యాయుల కోసం జరుగుతున్న పోరాటం కాదు..  ప్రజల కోసం చేస్తున్న పోరాటం అని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల పోరాటం ప్రజా ఉద్యమం గా మారక ముందే ప్రభుత్వం స్పందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ప్రైవేటుపరం చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. విద్యా రంగానికి సరిపడా నిధులు కేటాయించకుండా... విద్యా రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని తెలిపారు.