
కరోనా కల్లోలంతో చిన్నారుల చదువులు తల్లకిందులైపోయాయి. స్కూళ్లు మూతపడటంతో స్టూడెంట్లు పుస్తకాలకు దూరమైపోయారు. కొన్ని రాష్ట్రాల్లో బడులు తెరిచినా ఇప్పటికీ కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లో సరికొత్త ప్రయత్నం చేశారు. ఇప్పటికే అక్కడ ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. కానీ, చాలా మంది చిన్నారులకు స్మార్ట్ఫోన్లు లేకపోవడం.. కొన్ని చోట్ల నెట్వర్క్ ఇబ్బందుల కారణంగా చిన్నారులు క్లాసులు వినలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం బారాముల్లా జిల్లాలోని తంగ్మాంగ్ ఏరియాలోని ఓ గవర్నమెంట్ మిడిల్ స్కూల్లో ఓపెన్ ఎయిర్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రకృతి ఒడిలో చిన్నారులకు చదువు చెబుతున్నారు అక్కడి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు.