పాత పది జిల్లాల ప్రకారమే  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్లు, ప్రమోషన్లు

పాత పది జిల్లాల ప్రకారమే  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్లు, ప్రమోషన్లు

కరోనా ఎఫెక్ట్​తో షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆలస్యం: మంత్రి సబిత
హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: విద్యా శాఖలో కొందరు అధికారులు కరోనా బారినపడటంతో ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ల షెడ్యూల్ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీ మేరకు ప్రైమరీ స్కూళ్లలో హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్ల పోస్టుల మంజూరు కోసం ఫైల్ సర్క్యులేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని, ఆమోదం రాగానే బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఈసారి పాత పది జిల్లాల ప్రకారం, యాజమాన్యాల వారీగానే బదిలీలు, ప్రమోషన్లు నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. వీటితో పాటే మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు కూడా నిర్వహిస్తామన్నారు. టీచర్ల ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రమోషన్లను ఉమ్మడి 10 జిల్లాల ప్రాతిపదికన షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల జాక్ (జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నేతలు సోమవారం మంత్రిని కలిశారు. వేసవి సెలవులు పూర్తి కావస్తున్నా బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయకపోవడం పట్ల ఆయా సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ అంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా బదిలీల ఫైల్ సాధారణ పరిపాలనా శాఖ పరిశీలనకు పంపించామని, రాగానే సీఎంవో ఆమోదం తీసుకుని షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. టీచర్లకు వ్యాక్సినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.  
ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ల షెడ్యూల్ విడుదల చేయాలి: పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూటీ 
ఉమ్మడి 10 జిల్లాల ప్రాతిపదికన ప్రమోషన్లు, బదిలీలు హాలీడేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కంప్లీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూటీ కోరింది. సోమవారం సంఘం ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంజిరెడ్డి, జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ చెన్నయ్య, నేతలు సంగమేశ్వర్ రెడ్డి, అనంత రెడ్డి   హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి, భార్య, భర్తల అంతర జిల్లా బదిలీలు వెంటనే చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందించారు.  
ప్రైవేటు స్కూల్స్ ఫీజులు ఫిక్స్ చేయండి: ట్రస్మా
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు నిర్ణయించి, అకడమిక్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రైవేటు స్కూల్స్​మేనేజ్​మెంట్ల సంఘం(ట్రస్మా) కోరింది. రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు 10% ఫీజులు పెంచుకునే అవకాశమిచ్చినా, తాము15% తగ్గించి ఫీజులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, స్టేట్ ట్రెజరర్ శ్రీకాంత్​రెడ్డి, రాష్ట్ర ప్రతినిధి చింతల రాంచందర్ చెప్పారు. ఈ మేరకు  ట్రస్మా రాష్ట్ర నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.