బడుల్లో స్కావెంజర్లను నియమించాలి

బడుల్లో స్కావెంజర్లను నియమించాలి
  •     టీచర్ల సంఘాల డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు రీ ఓపెన్ కానున్న నేపథ్యంలో అన్ని బడులకు స్కావెంజర్లను నియమించాలని పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం. చెన్నయ్య, భిక్షంగౌడ్, సీపీఎస్​ఎంప్లాయీస్​యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం వేర్వేరు ప్రకటనలు రిలీజ్ చేశారు. దాదాపు నెలన్నర నుంచి స్కూళ్లకు సెలవులు ఉన్నాయని, ప్రస్తుతం వాటిని శుభ్రం చేసుకోవాల్సి ఉందన్నారు. 

గతంలో సర్వీస్ పర్సన్​ను తొలగించి, ఆ బాధ్యతలను గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. అయితే, ఆ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమలు కాలేదని వాపోయారు. జూన్ 1 నుంచి బడిబాట ప్రారంభమవుతుందని, కాబట్టి సాధ్యమైనంత త్వరగా స్కావెంజర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు.