
టీచింగ్ డాక్టర్ల వయో పరిమితి పెంపు బిల్లుకు ఆమోదం తెలిపింది శాసనసభ. టీచింగ్ డాక్టర్ల పదవీ విరమణ వయసు 65ఏళ్లకు పెంచుతూ… సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు ఎంఐఎం, బీజేపీ మద్దతు తెలిపాయి. మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత, మెడికల్ కాలేజీ సీట్లు తగ్గకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు కేసీఆర్.