ర్యాంకింగ్స్లో భారత్ కంటే బంగ్లా, అఫ్ఘాన్ బెటర్

ర్యాంకింగ్స్లో భారత్ కంటే బంగ్లా, అఫ్ఘాన్ బెటర్

ఐసీసీ విడుదల చేసిన వరల్డ్ కప్ వన్డే ఇంటర్నేషనల్ సూపర్ లీగ్ స్టాండింగ్లో టీమిండియా దారుణమైన పొజీషన్లో నిలిచింది.  బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్  వంటి పసికూనలు భారత్ కంటే ముందున్నాయి. కనీసం టాప్ 5లో కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. 

ఇటీవల జరిగిన వన్డేల్లో  ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా వన్డే ఇంటర్నేషనల్ సూపర్ లీగ్ స్టాండింగ్లో ఐసీసీ ర్యాంకులను ప్రకటించింది. దీని ప్రకారం ఇంగ్లాండ్ టీమ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. రీసెంట్గా నెదర్లాండ్స్పై వన్డే సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్..మొత్తం 125 పాయింట్లతో వన్డే సూపర్ లీగ్ స్టాండింగ్లో టాప్ పొజీషన్కు చేరుకుంది. మొత్తం 18 వన్డేల్లో 18 పాయింట్లను అందుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 120 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.  మూడో స్థానాన్ని   అఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. 12 వన్డేల్లో 100 పాయింట్లతో అఫ్ఘాన్ టీమ్..థార్డ్ ప్లేస్ను దక్కించుకోవడం విశేషం.  ఇక 90 పాయింట్లతో దాయాది పాకిస్థాన్ 4వ స్థానంలో..80 పాయింట్లతో వెస్టిండీస్ 5వ స్థానంలో నిలిచాయి. 

ఈ స్టాండింగ్స్లో  టీమిండియా పరిస్థితి పసికూనల కంటే దారుణంగా ఉంది. 12 మ్యాచ్‌లల్లో 79 పాయింట్లతో ఆరో స్థానానికే పరిమితమైంది. కనీసం టాప్ 5లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.

 70 పాయింట్లతో ఆస్ట్రేలియా-, 68 పాయింట్లతో ఐర్లాండ్, 62 పాయింట్లతో శ్రీలంక, 60 పాయింట్లతో న్యూజిలాండ్  ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.  అటు  దక్షిణాఫ్రికా- 49 పాయింట్లతో 11వ స్థానంలో.., జింబాబ్వే-15 పాయింట్లతో 12వ ప్లేస్ లో , నెదర్లాండ్స్-25 పాయింట్లతో 14వ స్థానాలను దక్కించుకున్నాయి.