టీమిండియాకు ఆడటం గౌరవంగా భావిస్తా

టీమిండియాకు ఆడటం గౌరవంగా భావిస్తా

టీమిండియా జెర్సీ ధరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ అన్నాడు. కరోనా నుంచి కోలుకుంటున్నానని త్వరలో మైదానంలోకి దిగుతానని స్పష్టం చేశాడు. తన ఆరోగ్యంపై అభిమానులకు ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు కేఎల్ రాహుల్.  జూన్లో తనకు హెర్నియాకు శస్త్రచికిత్స జరిగిందని..విజయవంతంగా కోలుకున్నానని తెలిపాడు. ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో  శిక్షణ పొందుతున్న సమయంలో కరోనా బారిన పడ్డానని చెప్పుకొచ్చాడు. దీంతో రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చిందన్నాడు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని..త్వరలో సెలక్టర్లకు అందుబాటులోకి వస్తానన్నాడు. టీమిండియాకు ఆడటం గౌరవంగా భావిస్తానన్న రాహుల్..బ్లూ జెర్సీని ధరించేందుకు వెయిట్ చేస్తున్నానని ట్విట్టర్ లో తెలిపాడు. 


సౌతాఫ్రికా టీ20 సిరీస్ కు కెప్టెన్గా ఎంపికైన రాహుల్..గాయంతో ఆ సిరీస్ నుంచి వైదొలిగాడు. ఆ గాయం తీవ్రత పెరిగిందని వైద్యులు చెప్పడంతో ఇంగ్లాండ్ పర్యటనకు రాహుల్ దూరమయ్యాడు. జూన్లో డాక్టర్ల సూచన మేరకు జర్మనీలో హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ సాధించడం కోసం ప్రాక్టీస్ చేశాడు. సెలక్టర్లు విండీస్తో వన్డే సిరీస్కు అతన్ని పరిగణలోకి తీసుకోకపోయినా...టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. అయితే ఈ నెల 21న రాహల్కు కొవిడ్ సోకింది. దీంతో అతను ఐసోలేషన్లో ఉండి కరోనా నుంచి కోలుకుంటున్నాడు. అయితే రాహుల్ పూర్తిగా కోలుకోకపోవడంతో..జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపికకాలేదు.