
ముంబై: టీ20 క్రికెట్‌లో దుమ్మురేపుతున్న టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మరో లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఆసియా కప్ కోసం దుబాయ్ వెళ్లే ముందు అతను మెర్సిడెస్–బెంజ్ జీఎల్ఈ కౌప్ కారును కొన్నాడు. దీని విలువ రూ. 2.15 కోట్లు. భార్యతో కలిసి షోరూంకు వచ్చిన సూర్య కారును ఇంటికి తీసుకెళ్లాడు. ఇప్పటికే అతని దగ్గర బీఎండబ్ల్యూ 5 సిరీస్ 530డీ ఎం స్పోర్ట్, ఆడి ఏ6, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లు, సుజుకి హయ బుస, హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ ఉన్నాయి. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖరీదైన రోల్స్ రాయిస్ కారుకు ఆర్డర్ ఇచ్చాడు.