కోలుకుంటున్న రిషబ్ పంత్.. ఇన్ స్టాలో పిక్ షేర్..

కోలుకుంటున్న రిషబ్ పంత్.. ఇన్ స్టాలో పిక్ షేర్..

డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ కు రెండు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడంతో పంత్ కోలుకుంటున్నాడు. అయితే దాదాపు 40 రోజుల తర్వాత  తన ఆరోగ్యంపై పంత్ కీలక అప్ డేట్ ఇచ్చాడు. బాల్కనీలో కూర్చున్న ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసిన రిషబ్ పంత్.  ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదని పంత్ తన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు. అయితే పంత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి భవనంలోనే పంత్ బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. 

గతేడాది డిసెంబర్ 30న ఉత్తరాఖండ్లో జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో  రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పంత్ ప్రయాణిస్తున్న  కారు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఆ తర్వాత  ముంబైలోని కోకిలబెన్ ధీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన పంత్కు మూడు సర్జరీలు చేశారు.  నుదిటి భాగంలో ప్లాస్టిక్ సర్జరీతో పాటు మోకాళ్లకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మరో ఆరు వారాల తర్వాత రిషబ్ పంత్‌కి ఇంకో సర్జరీ చేయాల్సి ఉంది. మరోవైపు వేగంగా కోలుకుంటున్న పంత్.. క్రికెట్ ఆడేందుకు కనీసం 6 నుంచి 9 నెలల వరకూ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.