వరుసగా12 సిరీస్లు గెలిచిన టీమిండియా

 వరుసగా12 సిరీస్లు గెలిచిన టీమిండియా

విండీస్పై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లు నెగ్గి చరిత్ర సృష్టించింది. 2007 నుంచి 2022 వరకు భారత్..12 వన్డే సిరీస్లు నెగ్గడం విశేషం. దీంతో ద్వైపాక్షిక సిరీస్లలో ఇతర జట్లకు సాధ్యం కానీ రికార్డు టీమిండియా క్రియేట్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. గతంలో పాకిస్తాన్ 11 సిరీస్లతో మొదటి స్థానంలో ఉండేది. జింబాబ్వేపై పాక్ 1996 నుంచి 2021 వరకు వరుసగా 11 సిరీస్లను గెలిచింది. ప్రస్తుతం భారత జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టింది. 

టీమిండియా సంబరాలు..
వెస్టిండీస్ గడ్డపై టీమిండియా మరోసారి వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి.  మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో దక్కించుకోవడంతో డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్లు సెలబ్రేట్ చేసుకున్నారు. కెప్టెన్ ధావన్ ఆధ్వర్యంలో సెలెబ్రేషన్స్‌ జరిగాయి. కేక్ కట్ చేసి .. హుహా హుహా అంటూ ఆటగాళ్లు రచ్చ చేశారు. పిడికిలి బిగించి  ఏయ్ కమాన్.. హహహ అంటూ ధావన్ అరవగా..ఇతర ప్లేయర్లు అతన్ని అనుసరించారు. ఈ వీడియోను ధావన్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. టాలెంట్ మ్యాచ్‌లను గెలిపిస్తుంది. కానీ టీమ్ వర్క్,  ఇంటలిజెన్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలబెడుతుంది. కుడోస్ టీమ్ అంటూ ఈ వీడియోకు ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ వీడియోపై  ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.