కప్పుపై గురిపెట్టి.. ఆసియా, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా

కప్పుపై గురిపెట్టి.. ఆసియా, వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా
  • నేడు వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  తొలి వన్డే
  • రాత్రి 7 నుంచి డీడీ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జియో సినిమాలో లైవ్

బ్రిడ్జ్​టౌన్​ (బార్బడోస్): నెల రోజుల్లో ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండు నెలల్లో స్వదేశంలో వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలవనుండగా.. వాటి కోసం టీమిండియా ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుంది. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మెగా టోర్నీలకు సరైన కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని చూస్తోంది. టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఊపుతో వన్డేల్లోనూ కరీబియన్ల పని పట్టాలని కోరుకుంటోంది.  మరోవైపు వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నకు క్వాలిఫై అవ్వలేకపోయిన వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతగడ్డపై ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయినా గెలిచి ఊరట దక్కించుకోవాలని ఆశిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఇరు జట్ల మధ్య మొదటి వన్డే జరగనుండగా..  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేన ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. 

వాళ్లపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వన్డే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్న టీమిండియా నయా స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్య కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కీపర్లు సంజు శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ సిరీస్​ కీలకం కానుంది. గాయంతో శ్రేయస్ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరం అవడంతో ఖాళీ అయిన నాలుగో నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కన్నేసిన సూర్య  టీ20 ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వన్డేల్లో చూపెట్టలేక  ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో గత సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డకౌట్లతో చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.  ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయినా తన బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూపెట్టాలని ఆశిస్తున్నాడు. కారు ప్రమాదానికి గురైన టీమిండియా మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు కోలుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించడం లేదు. సర్జరీ నుంచి కోలుకుంటున్న  కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీఎంట్రీ ఇస్తే టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బలమైన పోటీదారుడు అవుతాడు. ఈ నేపథ్యంలో  సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంజు శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య గట్టి పోటీ ఉంది. టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిపోతున్న శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈసారి మంచి పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే, విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకున్న ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే తొలి వన్డేలో  చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావొచ్చు. దాంతో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోటీ పడనున్నాడు.  రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్లుగా వస్తే  రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంకొంత కాలం బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉండనున్నాడు. ఐపీఎల్​తర్వాత రెస్ట్​ తీసుకున్న  వైస్​ కెప్టెన్​హార్దిక్​ పాండ్యా ఈ సిరీస్​ తర్వాత ఐదు టీ20ల సిరీస్​కు కెప్టెన్​గా ఉంటాడు. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను ఒకటి లేదా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లే ఆడే చాన్సుంది.  బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయానికి వస్తే జట్టులో తన మార్కు చూపెట్టేందుకు 23 ఏండ్ల యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉమ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇది మంచి అవకాశం. తన బౌలింగ్​లో పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నా ఎక్కువ రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తున్న ఈ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డపై రాణిస్తే జట్టులో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. టెస్టుల మాదిరిగా హైదరాబాదీ సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుండగా..  మూడో పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శార్దూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య పోటీ ఉంది. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జడేజా బరిలోకి దిగడం ఖాయమే. మెయిన్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా లెగ్గీలు చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఒక్కరికే చాన్సుంది.  ఈ ఏడాది ఇండియా ఆడిన 9 వన్డేల్లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8 వన్డేల్లో బరిలోకి దిగగా..  ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

విండీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీ ఇచ్చేనా?

వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెర్తు సాధించలేకపోయిన వెస్టిండీస్​ టీమ్​ ఆ బాధను మరిచి ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కొత్త ప్రయాణం ఆరంభించాలని చూస్తోంది. హిట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒషేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకతో ఆ జట్టు బలం కాస్త పెరిగింది. టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకున్న అలిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతానజేపై ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండనుంది. ఏదేమైనా బలమైన టీమిండియాకు కరీబియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏమేరకు పోటీనిస్తుందో చూడాలి.

జట్లు (అంచనా):
ఇండియా: రోహిత్‌‌ (కెప్టెన్‌‌),  శుభ్​మన్​ గిల్‌‌, కోహ్లీ, సూర్యకుమార్‌‌, హార్దిక్‌‌, శాంసన్‌‌ / ఇషాన్‌‌ కిషన్​ (కీపర్​), జడేజా, అక్షర్‌‌ / శార్దూల్, కుల్దీప్‌‌, సిరాజ్‌‌, ఉమ్రాన్‌‌ / ఉనాద్కట్‌‌ / ముకేశ్‌‌. 

వెస్టిండీస్‌‌: షై హోప్‌‌ (కెప్టెన్‌‌/కీపర్​), బ్రెండన్‌‌ కింగ్‌‌, మేయర్స్‌‌, కార్టీ, హెట్‌‌మయర్‌‌ , పావెల్‌‌, షెఫర్డ్‌‌, సింక్లెర్‌‌, అల్జారీ జోసెఫ్‌‌, గుడకేశ్‌‌ మోతీ/ యానిక్‌‌ / ఒషేన్ థామస్‌‌, జైడేన్‌‌ సీల్స్‌‌.