సెంచరీ దిశగా రోహిత్ శర్మ

సెంచరీ దిశగా రోహిత్ శర్మ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు టీమిండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఓవర్ నైట్ స్కోరు 77/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ, అశ్విన్ లు ఆచితూచి ఆడుతున్నారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును నడిపిస్తున్నారు. తొలి రోజు అర్థ సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ...రెండో రోజు ఆటను కొనసాగిస్తున్నాడు.   ప్రస్తుతం రోహిత్‌ 72, అశ్విన్‌ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది.