నిప్పులు చెరిగిన ఎంగిడి..49 పరుగులకే సగం వికెట్లు డౌన్

నిప్పులు చెరిగిన ఎంగిడి..49 పరుగులకే సగం వికెట్లు డౌన్

సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్..23 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. ఎంగిడి బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్లో మార్కరమ్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి మాంచి టచ్లో కనిపించిన విరాట్ కోహ్లీ సైతం..ఫుల్ షాట్ ఆడి..బౌండరీ లైన్ దగ్గర రబాడాకు చిక్కాడు.

కోహ్లీ తర్వాత వచ్చిన దీపక్ హుడా ఎక్కువ సేపు క్రీజులో  నిలబడలేకపోయాడు. నోర్ట్జే బౌలింగ్ లో డికాక్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. దీంతో టీమిండియా 42 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో సూర్యకుమార్కు హార్దిక్ పాండ్యా జతకలిశాడు. వీరిద్దరు జట్టును ఆదుకుంటారని అనుకున్నారు. కానీ ఎంగిడి మరోసారి దెబ్బ తీశాడు.  కోహ్లీ లాగే బంతిని ఆడబోయిన హార్దిక్..రబాడాకే చిక్కాడు. దీంతో  భారత్ ఖాతాలో 50 పరుగులు చేరకుండానే సగం వికెట్లు కోల్పోయింది.