కుంబ్లే రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్

కుంబ్లే రికార్డు బద్దలు కొట్టిన అశ్విన్

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.  భారత జట్టు సాధించిన అంతర్జాతీయ విజయాల్లో అనిల్ కుంబ్లే ఇప్పటివరకు 486 వికెట్లు తీయగా.. అశ్విన్ 489 వికెట్లతో కుంబ్లే రికార్డును బ్రేక్ చేశారు.  అటు కుంబ్లే మరో రికార్డును అశ్విన్ సమం చేశాడు.  స్వదేశంలో 25సార్లు 5 వికెట్లు తీసిన అశ్విన్.. కుంబ్లేతో సమంగా నిలిచాడు. 

నాగ్ పూర్ టెస్టులో అశ్విన్‌ మరో రికార్డును సాధించాడు. ఎక్కువ మంది లెఫ్ట్‌హ్యాండర్లను అవుట్ చేసిన బౌలర్‌గా నిలిచాడు. 166మ్యాచ్‌ల్లో అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. అశ్విన్ ఇప్పటి వరకు 230 మంది లెఫ్ట్‌ హ్యాండర్లను అవుట్ చేయడం విశేషం. మరోవైపు  ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ ఏడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో లంక స్పిన్ దిగ్గజం మురళిథరన్‌ మొదటి స్థానంలో ఉన్నాడు.

తొలి టెస్టులో అశ్విన్ హర్బజన్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ అవతరించాడు. అశ్విన్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 19 టెస్టులాడి 97  వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కంటే ముందు 111 వికెట్లతో కుంబ్లే టాప్ వన్లో ఉండగా..95 వికెట్లతో హర్భజన్ రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా తొలి టెస్టులో అశ్విన్ 8 వికెట్లు పడగొట్టడంతో భజ్జీని అశ్విన్ దాటేశాడు. మరో మూడు టెస్టులు మిగిలి ఉన్న నేపథ్యంలో అశ్విన్ ఇంకో 14 వికెట్లు  పడగొడితే కుంబ్లే రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.