తండ్రి x జడేజా..రవీంద్ర జడేజా ఫ్యామిలీలో విభేదాలు

తండ్రి x జడేజా..రవీంద్ర జడేజా ఫ్యామిలీలో విభేదాలు

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి. పెండ్లయిన తర్వాత జడేజా తమ  కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని తండ్రి అనిరుధ్‌‌‌‌సిన్హ్ జడేజా ఆరోపించాడు. దీనికి జడ్డూ భార్య, గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే అయిన రివాబానే కారణమని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

జడేజాకు పెండ్లయిన వెంటనే  అతనికి చెందిన రెస్టారెంట్ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌  విషయంలో  గొడవ జరిగిందన్నాడు. కొడుకు  దూరం కావడంతో తాను ఒంటరిగా ఉంటున్నానని, చనిపోయిన భార్య పేరిట వచ్చే రూ. 20 వేల పెన్షన్‌‌‌‌పైనే ఆధారపడుతున్నానని తెలిపాడు. అక్కతో కూడా జడేజాకు సత్సంబంధాలు లేవన్నాడు. అయితే, తండ్రి ఆరోపణలను జడేజా ఖండించాడు.

‘ఓ నాన్‌‌‌‌సెన్స్‌‌‌‌ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలన్నీ అర్థరహితమైనవి, అవాస్తవమైనవి. ఈ ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఇవి నా భార్య ప్రతిష్టను దిగజార్చడానికి చేసిన ప్రయత్నాలు. నేను కూడా చాలా చెప్పొచ్చు. కానీ, ఇలా పబ్లిక్‌‌‌‌గా చెప్పను’ అని ట్వీట్ చేశాడు.