టీ20ల్లో ఏకైక భారతీయుడు హార్దిక్ పాండ్యా

టీ20ల్లో ఏకైక భారతీయుడు హార్దిక్ పాండ్యా

టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20ల్లో నాలుగు వేల పరుగులు, వంద వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 2013లో ముంబైతో  తొలి టీ20 ఆడిన హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు 223 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 29.42 సగటుతో 4002 పరుగులు సాధించాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలున్నాయి. బెస్ట్ స్కోరు 91 పరుగులు.

టీ20లో హార్దిక్ పాండ్యా   27.27 సగటుతో మొత్తం 145 వికెట్లు పడగొట్టాడు.  ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లను మూడు సార్లు సాధించాడు. 

టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20ల్లో భారత్ కు కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఇప్పటివరకు టీ20ల్లో మూడు సిరీస్‌లలో సారథ్యం వహించిన పాండ్యా..మూడింటిలోనూ భారత జట్టును గెలిపించాడు. ఈ మూడు సిరీస్ లలోనూ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించాడు. ఇక ఇటీవలే న్యూజిలాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ సిరీస్‌లో 66 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు.