కేఎల్ రాహుల్ మళ్లీ విఫలం.....ఫ్యాన్స్ ఆగ్రహం

కేఎల్ రాహుల్ మళ్లీ విఫలం.....ఫ్యాన్స్  ఆగ్రహం

టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో దారుణంగా విఫలమైన కేఎల్ రాహుల్..ప్రతిష్టాత్మకంగా మొదలైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు.నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో రాహుల్..71 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ , కెప్టెన్ రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తుంటే..రాహుల్ మాత్రం క్రీజులో నిలబడేందుకు ఇబ్బంది పడ్డాడు. తీవ్ర ఒత్తిడిలో డిఫెన్స్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. 71 బంతులాడి కేవలం ఒకే ఒక ఫోర్ కొట్టాడు. స్పిన్నర్ ముర్ఫీ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. 

చివరి 10 ఇన్నింగ్స్ లలో..

కేఎల్ రాహుల్ చివరి 10 ఇన్నింగ్స్లలో కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ హాఫ్ సెంచరీని మినహాయిస్తే అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 23 పరుగులకే. గత 10 ఇన్నింగ్స్ లలో వరుసగా 23,50,8,12,10,22,23,10,2,20 పరుగులు చేశాడు. 
 

గిల్ పక్కనెట్టి..రాహుల్ కు ఛాన్స్..

వన్డేలు, టీ20ల్లో అద్బుతంగా రాణిస్తున్న శుభ్ మన్ గిల్ను పక్కన పెట్టిన రోహిత్ శర్మ..ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహల్ కు ఛాన్సిచ్చాడు. అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిన రాహుల్..మరోసారి విఫలమై అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. రాహుల్ కు బదులు గిల్ ను ఆడించినా బాగుండేదంటున్నారు. కొందరు అభిమానులైతే టీమిండియాకు కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయొద్దని బీసీసీఐ సెలక్టర్లకు సూచిస్తున్నారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న ప్లేయర్లు అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే..వచ్చిన అవకాశాన్ని కేఎల్ రాహుల్ యూజ్ చేసుకోవడం లేదని మండిపడుతున్నారు.