బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓటమి పాలవడంపై టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఇంత చెత్తగా ఫీల్డింగ్ చేస్తుందని తాను అనుకోలేదన్నాడు. కేఎల్ రాహుల్ వదిలేసిన క్యాచ్ను సుందర్ పట్టేందుకు ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించాడు.
గొప్పగా ఆడలేదు...
బంగ్లాదేశ్తో జరిగిన మొదటి మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం వల్లే ఓడిందని దీనేష్ కార్తీక్ అన్నాడు. చివరి ఓవర్ లో హసన్ ఇచ్చిన క్యాచ్ను రాహుల్ పట్టి ఉంటే బాగుండేదన్నాడు. అయితే అతను వదిలేసినా..పక్కనే ఉన్న సుందర్ బంతిని పట్టుకునేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించాడు. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్ల ఫీల్డింగ్ వల్ల తాను అసహనానికి గురైనట్లు చెప్పాడు. బ్యాటింగ్లోనూ గొప్పగా ఆడలేదని తెలిపాడు. చివరి ఓవర్లో ఒత్తిడి కారణంగా కొన్ని బౌండరీలు వదిలేసి ఉండవచ్చని కార్తీక్ చెప్పుకొచ్చాడు.
ఊహించనవి జరుగుతుంటాయి..
హసన్ క్యాచ్ వదిలేయడంపై కేఎల్ రాహుల్ స్పందించాడు. క్రికెట్‌లో కొన్ని సార్లు అనుకోనివి జరుగుతుంటాయని చెప్పాడు. మొదటి మ్యాచ్లో టీమిండియా బాగానే పోరాడిందని తెలిపాడు. అయితే కొన్ని క్యాచ్ల మిస్సింగ్.. హసన్ ఇన్నింగ్స్ వంటివి దెబ్బతీశాయని చెప్పాడు.