కివీస్తో రెండో టీ20..డేంజర్లో టీమిండియా

కివీస్తో రెండో టీ20..డేంజర్లో టీమిండియా

వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంతో టీ20 సిరీస్ లో అడుగుపెట్టిన టీమిండియా తొలి మ్యాచ్ లో ఓడింది. ఈ నేపథ్యంలో లక్నోలో జరిగే రెండో టీ20 కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ లోనూ ఓడితే టీమిండియా టీ20 సిరీస్ కోల్పోతుంది. దీంతో రెండో మ్యాచ్ లో భారత జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ ఓడిపోలేదు. అప్పట్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లలో ఓటమి పాలవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ రికార్డు ప్రమాదంలో పొంచి ఉంది. లక్నోలోనూ రోహిత్ సేన ఓడితే సిరీస్ కోల్పోవాలి..రికార్డు కోల్పోవాలి. 

పిచ్ పరిస్థితి ఏంటీ..?

న్యూజిలాండ్ తో రెండో టీ20 లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకానా స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్  బ్యాట్స్ మన్ కు సహకరిస్తుంది. వర్షం పడే ఛాన్సు లేదు. మ్యాచ్ టైంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితే మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన జట్టు మ్యాక్సిమమ్ బౌలింగ్ తీసుకునే ఛాన్సు ఎక్కువగా ఉంది. రెండో మ్యాచ్ లోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి. పిచ్ బౌలర్లకు సహకరించకపోవచ్చు. దీంతో బౌలర్లు వికెట్ల కోసం శ్రమించాల్సిందే. 

టీమిండియా తుది జట్టు(అంచనా): శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్