న్యూఢిల్లీ: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం టీమిండియా.. శనివారం జింబాబ్వే బయలుదేరి వెళ్లింది. చీఫ్ కోచ్‌గా ఎన్‌సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్.. టీమ్‌తో పాటు వెళ్లాడు. పేసర్ మహ్మద్ సిరాజ్, ధవన్, ప్రసిధ్ కృష్ణ, రుత్‌రాజ్ గైక్వాడ్ ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పెట్టింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఇండియా టీమ్ ఈ నెల 18, 20, 22న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఈ మ్యాచ్‌లు ఆడనుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఆడనున్న ఈ సిరీస్ జింబాబ్వేకు చాలా ప్రధానమైంది. ఈ సిరీస్‌లో రాణిస్తే జింబాబ్వే.. వరల్డ్‌కప్ టాప్–8 టీమ్స్‌లో చోటుతో డైరెక్ట్‌గా క్వాలిఫై అవుతుంది. ఆతిథ్య హోదాలో ఇండియా మెగా టోర్నీకి ఇప్పటికే క్వాలిఫై అయ్యింది.
