? Ind vs Nz Live Updates : రెండో వన్డేలో టీమిండియా విక్టరీ..సిరీస్ కైవసం

? Ind vs Nz Live Updates : రెండో వన్డేలో టీమిండియా విక్టరీ..సిరీస్ కైవసం

టీమిండియా విజయం..2-0తో వన్డే సిరీస్ కైవసం

రాయ్ పూర్ వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది.  న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. 109 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ సేన కేవలం  20.1 ఓవర్లలో 2 వికెట్ మాత్రమే నష్టపోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ  హాఫ్ సెంచరీతో రాణించగా..మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 40 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-0తో దక్కించుకుంది. సిరీస్ లో భాగంగా చివరి వన్డే ఈ నెల 27న జరగనుంది. 
 

రోహిత్ శర్మ (51)ఔట్: భారత్ స్కోరు 72/1

రాయ్ పూర్ వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ LBWగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 72 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం  శుభ్ మన్ గిల్ (21), కోహ్లీ (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత విజయానికి మరో 31 పరుగులు కావాలి

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ: భారత్ స్కోరు 71/0


రాయ్ పూర్ వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. 47 బంతుల్లో  7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో వన్డేల్లో 48వ అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్  నిలకడగా ఆడుతున్నారు. ఇప్పటికే తొలి వికెట్ కు అజేయంగా 71 పరుగులు జోడించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ (50), శుభ్ మన్ గిల్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు .భారత విజయానికి మరో 38 పరుగులు కావాలి
 

నిలకడగా ఆడుతున్న టీమిండియా : భారత్ స్కోరు 52/0

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది.  భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ అద్బుతంగా ఆడుతున్నారు. తొలి వికెట్ కు ఆజేయంగా 9.4  ఓవర్లలో 51 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో  రోహిత్ శర్మ (37), శుభ్ మన్ గిల్ (14) పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి మరో 57 పరుగులు కావాలి.

108 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

న్యూజిలాండ్ 103 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు నష్టపోయింది. 27 పరుగులు చేసిన సాంట్నర్ ను హార్దిక్ పాండ్యా పెవీలియన్ చేర్చగా..36 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న ఫిలిప్స్ ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. అనంతరం 105 పరుగుల వద్ద  ఫెర్గ్యూసన్..108 పరుగుల వద్ద టిక్నర్ ఔట్ అయ్యారు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. సిరాజ్, ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. 
 

 

8వ వికెట్ డౌన్: న్యూజిలాండ్ స్కోరు 104/8


రెండో వన్డేలో న్యూజిలాండ్ 8 వ వికెట్ కోల్పోయింది. 103 పరుగుల వద్ద కివీస్ వరుసగా రెండు వికెట్లు నష్టపోయింది. 27 పరుగులు చేసిన సాంట్నర్ ను హార్దిక్ పాండ్యా పెవీలియన్ చేర్చగా..36 పరుగులతో ప్రమాదకరంగా మారుతున్న ఫిలిప్స్ ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 108 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో హెన్రీ షిప్లే (1)
ఫెర్గ్యూసన్ (0) పరుగులతో ఉన్నారు 

 

6వ వికెట్ డౌన్: న్యూజిలాండ్ స్కోరు 56/6

రెండో వన్డేలో కివీస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కొనసాగుతున్న  న్యూజిలాండ్ ను మహ్మద్ షమీ మరోసారి దెబ్బ కొట్టాడు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్ వెల్ (22)ను 6వ వికెట్ గా ఔట్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో  మిచెల్ సాంట్నర్ (0) గ్లెన్ ఫిలిప్స్ (18) పరుగులతో ఆడుతున్నారు. 
 

5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో కివీస్ 

రాయ్పూర్  వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య  జరుగుతోన్న రెండో వన్డే మ్యాచ్ లో స్వల్ప వ్యవధిలో  5 వికెట్లను కోల్పోయి కివీస్ జట్టు కష్టాల్లో పడింది. భారత బౌలర్ల దెబ్బకు కివీస్‌ టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. 13 ఓవర్లు ముగిసే టైమ్ కు కివీస్ 5 వికెట్ల నష్టానకి 30 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో గ్లెన్‌ ఫిలిప్స్‌(8), మైకెల్‌ బ్రాస్‌వెల్(4) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 2 వికెట్లు తీయగా సిరాజ్, ఠాకూర్, పాండ్య చెరో వికెట్ తీశారు. 

 

న్యూజిలాండ్ స్కోరు 9/3

రాయ్ పూర్ వన్డేలో న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగుల వద్ద డార్లీ మిచెల్ (1) ఔటయ్యాడు. షమీ బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరిగాడు.  ప్రస్తుతం క్రీజులో 
డెవాన్ కాన్వే(2),టామ్ లాథమ్ (0) ఉన్నారు. 

 

న్యూజిలాండ్ స్కోరు 8/2

రాయ్ పూర్ వన్డేలో న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 8 పరుగుల వద్ద హెన్రీ నికోలస్ (2) పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో 
డెవాన్ కాన్వే(2), డార్లీ మిచెల్ (0) ఉన్నారు. 

న్యూజిలాండ్ స్కోరు 0/1

రెండో వన్డేలో న్యూజిలాండ్ టీమ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ సున్నా పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. మహ్మద్ షమీ బౌలింగ్ లో ఫిన్ అలెన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో డెవాన్ కాన్వే(0), హెన్రీ నికోలస్ (0) పరుగులతో ఉన్నారు


న్యూజిలాండ్పై తొలి వన్డే నెగ్గ మాంచి ఊపుమీదున్న టీమిండియా రెండో వన్డేలో బరిలోకి దిగింది. రాయ్ పూర్ లో జరుగుతున్న ఈ వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు..రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ ను దక్కించుకోవాలని భావిస్తోంది. మరోవైపు తొలి వన్డేలో ఓడిన న్యూజిలాండ్..రెండో వన్డేలో గెలిచి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఆడుతోంది. 

భారత్ తుది జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ. 

న్యూజిలాండ్ తుది జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్, వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.