డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవం!

డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవం!

టీమిండియా డబ్ల్యూటీసీలో (వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్) ఫైనల్ చేరే అవకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతున్నాయి. ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను పక్కకు నెట్టి టేబుల్ టాప్ కి వెళ్లే అవకాశాలూ కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మూడో టెస్ట్ డ్రాగా ముగియడంతో, భారత్ కు అవకాశాలు దక్కే ఛాన్స్ లు ఉన్నాయి. భారత్ మొదటి స్థానాన్ని దక్కించుకోవాలంటే ఫిబ్రవరి-మార్చి నెల్లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ ని 3-1తోగానీ లేదా 3-0 తోగాని గెలిస్తే వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీకి అర్హత సాధిస్తుంది. 

 

ఒక వేళ ఈ సిరీస్ లో భారత్ తేలిపోతే ఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నట్టే. లేదా 2-1తో గెలిచినా ఫైనల్ బెర్త్ కు అవకాశం ఉంటుంది. అదెలాగంటే.. శ్రీలంక,న్యూజిలాండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ ఒక దాంట్లో గెలిచినా లేదా డ్రా చేసుకున్నా భారత్ కి అవకాశం ఉంటుంది. సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగే సిరీస్ లోనూ వెస్టిండీస్ ఒకదాంట్లో గెలిచినా లేదా డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్ చేరుతుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో ఆసీస్ (75.56), రెండవ స్థానంలో భారత్ (58.93) ఉన్నాయి. శ్రీలంక (53.93), సౌత్ ఆఫ్రికా (48.72) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.