
వడోదర: టీమిండియా సీనియర్ బ్యాటర్, తెలుగుతేజం అంబటి రాయుడు.. తిరిగి బరోడాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సీజన్ డొమెస్టిక్ క్రికెట్‌కు అతను అందుబాటులో ఉంటాడని బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిషిర్ హట్టంగడి వెల్లడించాడు. ఐపీఎల్ కంటే ముందే రాయుడు తమను కలిశాడని తెలిపాడు. ‘ప్రొఫెషనల్’ క్రికెటర్ కేటగిరీలో అతను బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. గతంలో రాయుడు హైదరాబాద్, ఆంధ్ర, విదర్భకు ఆడాడు.