శేఖర్ మాస్టర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరు

శేఖర్ మాస్టర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరు

మెగాస్టార్ ‘చిరంజీవి’ నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా షూటింగ్ జరుగుతున్న వేళ.. ప్రముఖ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ జన్మదినం జరుపుకున్నారు. చిరంజీవి సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శేఖర్ మాస్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫొటోను మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. త్వరలోనే పెద్ద బర్త్ డే పార్టీకి సిద్ధంగా ఉండండి అంటూ వెల్లడించింది. టాలీవుడ్ అగ్ర కొరియోగ్రాఫ‌ర్స్‌లో శేఖ‌ర్ మాస్టర్ ఒక‌రు. అగ్ర హీరోలందరితోనూ ఆయన వర్క్ చేశారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. పలు టీవీషోలకు జడ్జీగా వ్యవహరించారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా పలు అవార్డులు అందుకున్నారు. 

ఇక వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ సినిమా విషయానికి వస్తే...ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీగా రీఎంట్రీలోను చిరంజీవి అదరగొడుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్.. ఇప్పుడు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రీకరణలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్‏కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు.