‘బూకి’ క్లైమాక్స్ చూశాక కన్నీళ్లు వస్తాయి: హీరో విజయ్ ఆంటోనీ

‘బూకి’ క్లైమాక్స్ చూశాక కన్నీళ్లు వస్తాయి: హీరో విజయ్ ఆంటోనీ

హీరో విజయ్ ఆంటోనీ సమర్పణలో అజయ్ దిషన్, ధనుషా జంటగా గణేష్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూకి’. రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. మంచు లక్ష్మీ, సునీల్  కీలక పాత్రలు  పోషించారు. ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమా సురేష్​ ప్రొడక్షన్స్ ద్వారా  ఫిబ్రవరి 20న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ ‘‘మార్గన్’ చిత్రంతో అజయ్  నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ చిత్రంలోనూ  తన నటన  అందరినీ అలరిస్తుంది. తెలుగు ఆడియన్స్  టాలెంట్‌‌‌‌ని ఎప్పుడూ  సపోర్ట్ చేస్తారు.

ధనుషా  స్క్రీన్‌‌‌‌పై  క్యూట్‌‌‌‌గా ఉంటుంది. మంచు లక్ష్మీ , సునీల్  పెర్ఫార్మెన్స్ అదిరిపోతుంది.  క్లైమాక్స్ చూస్తున్నప్పుడు  కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి.  అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది’ అని చెప్పాడు. ఇదొక యూత్‌‌‌‌ఫుల్ సినిమా అని మంచు లక్ష్మీ చెప్పింది.   ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే కథ ఇదని హీరో హీరోయిన్ అన్నారు.  తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ  సినిమా ఉంటుందని డైరెక్టర్ గణేష్ చంద్ర అన్నాడు. రైటర్ భాష్యశ్రీ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.