టెక్ సెక్టార్‎కు పీడకలలా 2025: ఈ ఏడాది వేల మందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు, స్టార్టప్‎లు

టెక్ సెక్టార్‎కు పీడకలలా 2025: ఈ ఏడాది వేల మందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు, స్టార్టప్‎లు

న్యూఢిల్లీ: ఇండియా టెక్ సెక్టార్ 2025లో పెద్ద మార్పులను చూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) వాడకం పెరుగుతుండడంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. ఐటీ సర్వీసెస్ కంపెనీలు, కన్జూమర్ ఇంటర్నెట్ స్టార్టప్లు, ఇండియాలోని గ్లోబల్ టెక్ కంపెనీలు 2025లో ఎక్కువగా ఉద్యోగులను తొలగించాయి.

జాబ్స్ తీసేసిన కంపెనీలు..

ఏఐ వాడకాన్ని పెంచిన టీసీఎస్, సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో 2 శాతానికి సమానం. ముఖ్యంగా మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగాలను తీసేసింది. టెక్ మహీంద్రా 4 వేల మందిని తొలగించగా, విప్రో, ఇన్ఫోసిస్ కూడా కొన్ని వేలల్లో ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఈ కంపెనీలు ఏఐ వాడకం పెంచాయి. ఆటోమేషన్తో ఖర్చులు తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్, పబ్లిక్ లిస్టింగ్ తర్వాత నష్టాలను తగ్గించుకునేందుకు వెయ్యి మందిని తొ లగించింది. జెప్టో 300 మందిని తీసేయగా, పనులను ఆటోమేషన్, ఔట్సోర్సింగ్ ద్వారా నిర్వహిస్తోంది. వెర్స్ ఇన్నోవేషన్ (డైలీహంట్, జోష్) 350 మందిని తొలగించింది. గష్టప్ 500 మందిని తగ్గించింది.

ప్రభుత్వం 2025లో రియల్ మనీ గేమింగ్ను నిషేధించింది. దీంతో 500 మంది ఇంజనీర్లను కొత్త ఏఐ, ఫిన్టిక్ ప్రాజెక్టులకు డ్రీమ్ 11 మార్చింది. మొబైల్ ప్రీమియర్ లీగ్ 600 మందిని తొలగించింది. గేమ్స్ క్రాఫ్ట్ 400 మందిని తీసేసింది. ప్రపంచవ్యాప్తంగా 14 వేల ఉద్యోగాలను తగ్గించుకున్న అమెజాన్, భారతదేశంలో కూడా వెయ్యి మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది.

గ్లోబల్ కంపెనీల్లోనే ఎక్కువ..

మైక్రోసాఫ్ట్ 15 వేల మందిని తీసేయగా, ఇంటెల్ తన ఉద్యోగుల్లో 15 శాతం మందిని ఇంటికి పంపించేసింది. సుమారు 25 వేల మందిని తొలగించింది. యాపిల్ అమెరికాలో డజన్ల కొద్దీ సేల్స్ ఉద్యోగాలకు కోత పెట్టింది. ఏఐ విభాగంలో 600 మందిని మెటా తొలగించింది. టెలికం కంపెనీ వెరిజాన్ 13 వేల మందిని, జర్మనీ ఇండస్ట్రీయల్ టెక్ కంపెనీ సీమెన్స్ 5,600 మందిని. సేల్స్ఫర్స్ 4 వేల మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొల గించాయి. ల్యాప్ టాప్ తయారీ కంపెనీ హెచ్పీ 2028 నాటికి 4 వేల నుంచి 6 వేల మందిని తీ సేయనుంది.