వన్​ ప్లస్ మొబైల్స్​లో టెక్నికల్ ప్రాబ్లమ్... సర్వీస్ సెంటర్ల వద్ద కస్టమర్ల బారులు

వన్​ ప్లస్ మొబైల్స్​లో టెక్నికల్ ప్రాబ్లమ్... సర్వీస్ సెంటర్ల వద్ద కస్టమర్ల బారులు
  • సర్వీస్ సెంటర్ల వద్ద కస్టమర్ల బారులు

బషీర్ బాగ్, వెలుగు: సిటీలోని హిమాయత్ నగర్, లిబర్టీ వన్​ప్లస్ సర్వీస్ సెంటర్ల వద్ద కస్టమర్లు గురువారం బారులు తీరారు. సాఫ్ట్​వేర్ అప్​డేట్​చేయడంతో మొబైల్స్ సరిగా పని చేయడం లేదని కస్టమర్లు తెలిపారు.

ఫోన్​పై లైన్స్ ఏర్పడి, డిస్ ప్లే లు పని చేయడం లేదన్నారు. ఫోన్ రిపేర్​కు ఇచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంకా రిపేర్ చేయలేదని మెహదీపట్నంకు చెందిన అస్లాం ఖాన్ తెలిపారు.