ఎక్స్​పీరియం భలేగుంది..ఎకో ఫ్రెండ్లీ పార్కును విజిట్ చేసిన అందగత్తెలు

ఎక్స్​పీరియం భలేగుంది..ఎకో ఫ్రెండ్లీ పార్కును విజిట్ చేసిన అందగత్తెలు

‘పర్యావరణ పరిరక్షణ’లో భాగంగా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు శుక్రవారం సిటీ శివారులోని ఎక్స్​పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును విజిట్​చేశారు. 85 దేశాల నుంచి తీసుకొచ్చి పెంచుతున్న అక్కడి అరుదైన మొక్కలు, వృక్ష జాతులు, శిల్పకళా సంపదను చూసి ఆశ్చర్యపోయారు. డోల్​ బీట్లకు ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. డీజే పాటలకు ఆడి పాడారు. పార్కును చుట్టేస్తూ ఫొటోలు తీసుకున్నారు.

బ్యూటీస్​.. హెల్త్​ అవేర్నెస్​

హెల్త్​ టూరిజంలో భాగంగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్స్ ను శుక్రవారం మిస్​వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించారు. ఆఫ్రికా గ్రూప్ నుంచి 25 మంది కంటెస్టెంట్లు వెళ్లగా వారికి ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారిలో ధైర్యం నింపారు. ఆస్పత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.