
చదివేది కంప్యూటర్ చదువు.. అలాంటిది అందులోనే స్కిల్ లేకపోతే ఎట్టా.. చదువు తర్వాత చేయాల్సిన కొలువు కూడా కోడింగ్ పైనే.. అలాంటిది కోడింగ్ కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే ఎలా.. నాలుగేళ్ల డిగ్రీ కంటే.. నాలెడ్జ్ ఉంటేనే కదా ఉద్యోగం ఇచ్చేది.. మరి అలాంటి నాలెడ్జ్ నాలుగేళ్లలో నేర్చుకోకపోతే ఎలా.. ఇవన్నీ పద్దతిగా.. పెద్దలు చెబితే వినే రోజులా ఇవి.. ఇవే మాటలను.. మన మల్లారెడ్డి.. మాజీ మంత్రి సారూ.. తనదైన స్టయిల్ చెప్పారు.. అంతే.. ఆహా.. ఓహో.. ఏం సెప్పితిరి.. ఏం సెప్పితిరి అంటున్నారు.. మల్లారెడ్డి సారూ.. వందకు వంద శాతం కరెక్ట్ అంటూ శభాష్.. శెభాష్ అంటున్నారు బీటెక్ బాబులు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మల్లారెడ్డి లాజిక్ పాయింట్ ఏంటో విందామా..
బీటెక్ పాస్ అవుతున్నారు.. 70, 80 శాతం పర్సంటేజీలు కూడా వస్తున్నాయి.. అయినా ల్యాప్ టాప్ ఆపరేటింగ్ తెలియటం లేదు.. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కు సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు.. ల్యాప్ టాప్ లో ప్రజంటేషన్ ఇవ్వలేరు.. ల్యాప్ టాప్ లో రిపోర్ట్ కూడా తయారు చేసుకోలేకపోతున్నారు.. స్కిల్స్ లేకుండా MNC కంపెనీలు ఉద్యోగం ఎలా ఇస్తాయి అంటూ బీటెక్ బాబులను ప్రశ్నించారు మల్లారెడ్డి.. అందుకే బీటెక్ స్టూడెంట్స్ డే వన్ నుంచి కాలేజీకి.. ల్యాప్ టాప్ తో రావాలి.. ఫస్ట్ ఇయర్ లోనే కోడింగ్ చేసుకోవాలి.. పైతాన్ పై పట్టుపట్టాలి.. జావా, కోడింగ్ అంతా ఫస్ట్ ఇయర్ లోనే నేర్పించేయాలి.. డిజిటల్ బోర్డుపైనే చదువుకోవాలి.. ల్యాప్ టాప్ లో చదువుకోవాలి.. అప్పుడే సెకండ్, థర్డ్ ఇయర్ ఈజీగా అయిపోతుంది అంటూ తనదైన స్టయిల్ లో చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.
ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్లారెడ్డి చెప్పిన అభిప్రాయంపై ఫుల్ అంటే ఫుల్ గా పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి.. ఫెంటాస్టిక్ మల్లన్న.. సూపర్ గా చెప్పావ్ అంటున్నారు బీటెక్ బాబులు. పాలు పితకటమే కాదు.. గుండెలు కూడా పిండేశావ్ అంటూ మరికొంత మంది కామెంట్స్ చేశారు.
మన మల్లన్న మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పిండు అంటుంటే.. ఇంకొందరు అయితే మల్లన్న నువ్వు కామెడీ పీస్ కాదు.. బాధ్యత ఉన్న వ్యక్తివి అంటూ తమ ఫీలింగ్ కు అక్షర రూపం ఇచ్చారు నెటిజన్లు.
నిజమే కదా.. నాలుగేళ్లు బీటెక్ చేసి కంప్యూటర్ ఆపరేటింగ్ తెలియదు.. ల్యాప్ టాప్ లో డెమో కూడా ఇవ్వలేనప్పుడు ఎవరు మాత్రం ఉద్యోగాలు ఇస్తారు.. బీటెక్ అంటూ కాలేజీలు ఎగ్గొట్టి బలాదూర్లు తిరిగే ఎవరు ఉద్యోగం ఇస్తారు అంటూ ఇంకొందరు బీటెక్ బాబులు తమ ఫీలింగ్స్ రాసుకొచ్చారు.
మల్లారెడ్డి కరెక్ట్ గా చెప్పారు.. ఆయన చెప్పినట్లు చేస్తే ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది.. లైఫ్ సెటిల్ అవుతుంది.. నాలుగేళ్లు మల్లారెడ్డి చెప్పినట్లు కష్టపడితే చాలు.. జీవితం హ్యాపీగా అంటూ ఇంకొందరు తమ అభిప్రాయాన్ని రాసుకొచ్చారు..
టోటల్ మాల్లారెడ్డి.. బీటెక్ కుర్రోళ్ల మనసును మరోసారి దోచేశారు.. ఎప్పుడూ ఎంటర్ టైన్ మెంట్ తీసుకునే కుర్రోళ్లు.. ఈసారి మాత్రం గుండెలను టచ్ చేశాడు..