మానవ తీర్పునుటెక్నాలజీ భర్తీ చేయలేదు: ఆక్స్‌‌‌‌ఫర్డ్ యూనియన్‌‌‌‌లో సీజేఐ

మానవ తీర్పునుటెక్నాలజీ భర్తీ చేయలేదు: ఆక్స్‌‌‌‌ఫర్డ్ యూనియన్‌‌‌‌లో సీజేఐ

 న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థలో వస్తున్న టెక్నాలజీ మార్పులకు యువ న్యాయవాదులు, యువ న్యాయాధికారులే పెద్ద బలమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.  ఆక్స్‌‌‌‌ఫర్డ్ యూనియన్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  న్యాయవ్యవస్థలో జరుగుతున్న సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. 

అలాగే, కృత్రిమ మేధ (ఏఐ) భారీ స్థాయిలో ఉన్న న్యాయ సమాచారాన్ని చాలా వేగంగా విశ్లేషించగలదని చెప్పారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మానవ తీర్పును పూర్తిగా భర్తీ చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయలేదని సీజేఐ అన్నారు.