హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ క్రీడల స్వరూపాన్ని మార్చివేసిందని టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అన్నాడు. స్పోర్ట్స్, వెల్‌నెస్, ఫిట్‌నెస్, టెక్నాలజీ స్టార్టప్స్‌కు స్ప్రింట్ ఎక్స్ సంస్థ ఒక మార్గదర్శిగా పని చేస్తోందన్నాడు. ‘గత 7, 8 ఏళ్లుగా క్రీడలతో టెక్నాలజీ బంధం మరింత పెరిగింది.
ఆట ప్రణాళికలు, వ్యూహాలు, సన్నద్ధత మాత్రమే కాకుండా ఫిట్‌నెస్, వెల్‌నెస్ పరంగా కూడా టెక్నాలజీ సేవలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. క్రికెట్ విషయానికొస్తే ప్రత్యర్థి బలహీనతలను అంచనా వేయడం, ఏ లెంగ్త్‌లో బాల్స్ వేయాలి, పిచ్‌పై ఎక్కడ బంతులు వేయకూడదు, బ్యాటర్లను కట్టడి చేయడానికి కావాల్సిన సన్నద్ధ, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రాక్టీస్, మ్యాచ్ డే తర్వాత తిరిగి బాడీ రీ చార్జ్ అయ్యేందుకు, గాయపడినప్పుడు తిరిగి కోలుకునేందుకు కూడా టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాం’ అని చహల్ పేర్కొన్నాడు.
స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ స్పోర్ట్స్ స్టార్టప్‌ల కోసం ‘స్ప్రింట్ ఎక్స్ ప్లేమేకర్స్’ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని చహల్ ప్రారంభించాడు.
