షాద్ నగర్, వెలుగు: కొత్తూరు మండల పరిధిలోని తీగపూర్లో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం ముఖ్య అతిథిగా ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయప్రద జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
