కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న

కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్న

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న  కొద్దీ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  మల్లన్నకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు  మానిక్ రావ్ ఠాక్రే.   దీనికి సంబంధించిన  ఫోటోలను కాంగ్రెస్  సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  

గతకొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ వార్తలు రాగా వాటిని నిజం చేస్తూ ఆ ప్రచారానికి తెర దించారు మల్లన్న.  గతంలో బీజేపీలో చేరిన మల్లన్న ఆ తరువాత ఆపార్టీకిరాజీనామా చేశారు. అంతకుముందు హుజూర్‌నగర్ ఉపఎన్నికలు, పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు.  

ఇక ఈ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా  పోటీ చేస్తానని, మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తానంటూ శపధం చేశారు మల్లన్న.  కానీ ఇప్పుడు సడన్ గా ఆయన కాంగ్రెస్ లో చేరారు.  అటు కాంగ్రెస్ కూడా మేడ్చల్ అభ్యర్థిగా తోటకూర వజ్రేష్ యాదవ్ ను కేటాయించింది.  ఈ క్రమంలో మల్లన్నకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తో్ంది.  తీన్మార్ మల్లన్న చేరికతో  కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగిందని అని చెప్పడంలో నో డౌట్