త్వరలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర

V6 Velugu Posted on Jun 22, 2021

తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు నెలలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర చేయనున్నట్టు ఆయన టీమ్ సభ్యుడు పందిరి భూమన్న స్పష్టం చేశారు.  రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూకబ్జాలను బయట పెడతామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకున్నదంతా త్వరలోనే కక్కిస్తామన్నారు. అధికారులు కేసీఆర్‌కి పాలేరులుగా మారారని ఆయన విమర్శించారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కాళ్ళు మొక్కడం సిగ్గుచేటన్నారు. పోలీస్ స్టేషన్లకి న్యాయం కోసం వెళ్తే ఉల్టా కేసులు బనాయిస్తున్నారని భూమన్న ఆరోపించారు. 

Tagged teenmar mallanna, TRS, Telangana, CM KCR, Padayatra, , pandiri bumanna

Latest Videos

Subscribe Now

More News