గవర్నర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న భార్య

గవర్నర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న భార్య

తీన్మార్ మల్లన్నను రిమాండుకు తరలించిన అనంతరం ఆయన భార్య మమత, గవర్నర్ తమిళి సైను కలిశారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి జెలుకు తరలించాలని, అక్కడ ఆయనకు ప్రమాదం ఉందని గవర్నర్ కు మమత ఫిర్యాదు చేశఆరు. పోలీసులపై తమకు నమ్మకం లేదన్న ఆమె.. మల్లన్నపై పెట్టిన కేసులపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరినట్టు స్పష్టం చేశారు.

తన కొడుకుపై అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టి జైలుకు పంపించారని తీన్మార్ మల్లన్న తల్లి ఆరోపించారు. చర్లపల్లి  జైలులో మల్లన్నకు ప్రాణహాని ఉందని, అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే వారు ఉన్నారని, ఇబ్బందులకు గురిచేస్తారని చెప్పారు. జైళ్లో మల్లన్నకు ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాదే బాధ్యత అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న అక్రమ అరెస్టులపై గవర్నర్ కి మెమోరాండం ఇచ్చామని స్పష్టం చేశారు. ఈ విషయంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని తీన్మార్ మల్లన్న తల్లి చెప్పారు. రాష్ట్రంలో ప్రజల కోసం కొట్లాడే మీడియా సంస్థలపై దాడులు జరుగుతున్నాయని  గవర్నర్ కి తెలియజేశామన్నారు. మల్లన్న అరెస్టు రిమాండ్ పై విచారణకు హైకోర్టులో పిల్ దాఖలు చేశామని తెలియజేశారు. కింది కోర్టులో బెయిల్ పిటిషన్ సైతం దాఖలు చేశామన్న ఆమె.. మల్లన్నను విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని ఓయూ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

తీన్మార్ మల్లన్నను మార్చి 21 మంగళవారం రోజు పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో 20 మంది పోలీసులు ఫిర్జాదిగుడాలోని మల్లన్న Q న్యూస్ ఆఫీస్ లో సోదాలు చేశారు. అంతకుముందు రెండు రోజుల క్రితమే తీన్మార్ మల్లన్న కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేసి.. విధ్వంసం సృష్టించగా.. ఆయన్ను అరెస్టు చేయడంపై తీవ్ర ఆందోళన నెలకొంది. దాడి ఘటనపై మేడిపల్లి పోలీసులకు తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. తాను బయటకు వెళ్లిన సమయంలో వచ్చి తన కార్యాలయంపై దాడి చేశారని మల్లన్న తెలిపారు. గతంలో సైతం క్యూ న్యూస్ ఆఫీసుపై దాడులు చేసిన వారిని ఇప్పటికీ ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని తీన్మార్ మల్లన్న తెలిపారు. చాలాసార్లు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగినా.. వార్తలు ఆగలేదన్నారు.