‘హనుమాన్’ నుంచి లేటెస్ట్ అప్ డేట్

‘హనుమాన్’ నుంచి లేటెస్ట్ అప్ డేట్

తేజ సజ్జ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్​షో ఎంటర్​టైన్మెంట్స్ బ్యానర్ పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇందులో తేజ సజ్జ సరసన అమృత అయ్యార్ హీరోయిన్ గా నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈమూవీ పోస్టర్ ను దర్శకుడు ప్రశాంత్‌ వర్మ విడుదల చేశారు.

ఇవాళ హీరో తేజ సజ్జ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా సినిమా నుండి స్పెషల్ బర్త్ డే పోస్టర్ ను వదిలారు. అంతేకాదు రిలీజ్‌ డేట్‌ పై కూడా ఇంట్ ఇచ్చాడు దర్శకుడు. దసరాకు కచ్చితంగా నీకు గిఫ్ట్‌ ఇస్తానంటూ.. తేజ సజ్జ ను ట్యాగ్‌ చేశాడు ప్రశాంత్‌ వర్మ. దీంతో ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్‌ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది.