
సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, రైటర్, డైరెక్టర్‌గా రాణించి మల్టీ టాలెంటెడ్‌గా ప్రూవ్ చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని.. ‘మిరాయ్’ అనే సూపర్ హీరో సినిమాని తెరకెక్కించాడు. తేజ సజ్జా హీరోగా మంచు మనోజ్ విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీక్ ఘట్టమనేని చెప్పిన విశేషాలు.
‘‘అశోకుని వద్ద తొమ్మిది గ్రంథాలు ఉన్నాయనేది ఓ నమ్మకం. ఆ పుస్తకాలు దుష్టుల బారిన పడితే, వాటిని మన ఇతిహాసాల్లోని పరిష్కారాల ద్వారా ఎలా కాపాడవచ్చనేది ‘మిరాయ్’ ఐడియా. మన ఇతిహాసాలు, పురాణాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉంటాయనే నమ్మకంతో చేసిన కథ. ఈ కథని యాక్షన్ అడ్వంచర్‌గా ట్రీట్ చేశాం. ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్. కథ దాదాపు ప్రజెంట్‌లోనే జరుగుతుంది. శ్రీలంక, నేపాల్, రాజస్తాన్, థాయ్‌లాండ్‌లోని లైవ్ లొకేషన్స్‌లో షూట్ చేశాం.
మంచు పర్వతాల్లో, ఎడారుల్లో, అడవులు లాంటి రియల్ లొకేషన్స్‌లో తీశాం. మొత్తం షూటింగ్‌లో ఒక్క యాక్టర్‌కి కూడా కార్వాన్ లేదు. వారి సపోర్ట్ వలన ఈ సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఇందులో ఆరేడు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ఫాస్ట్ యాక్షన్ సీన్స్ కోసం తేజ థాయ్‌లాండ్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. మనోజ్‌కి మార్షల్ ఆర్ట్స్‌లో అనుభవం ఉండటం మాకు హెల్ప్ అయ్యింది.
తేజకి మదర్‌గా శ్రియా గారి పాత్ర చాలా కీలకం. తల్లీ కొడుకుల ఎమోషన్ హైలైట్‌గా ఉంటుంది. జయరాం అగస్త్య మునిగా, జగపతి బాబు తాంత్రిక గురువు పాత్రలో కనిపిస్తారు. అలాగే జటాయువు సోదరుడు సంపాతి పాత్రని స్ఫూర్తిగా తీసుకొని ఒక సీక్వెన్స్ చేశాం. అది చాలా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. దీనికోసం యానిమేట్రానిక్ టెక్నాలజీ ఉపయోగించాం. మా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియానే వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా చేయడంతో మాకు మరింత హెల్ప్ అయ్యింది. విశ్వప్రసాద్ గారు మా విజన్‌ను పూర్తిగా నమ్మారు. హరి గౌర మ్యూజిక్ కథను ఎలివేట్ చేసేలా ఉంటుంది. ఇక ఈ కథకు సీక్వెల్ చేసే పొటెన్షియాలిటీ ఉంది. మూవీ రిజల్ట్‌ని బట్టి ఆలోచిస్తాం’’.
ఆగస్ట్ 28న రిలీజైన మిరాయ్ ట్రైలర్ అంచనాలు పెంచింది. అదిరిపోయే సినిమాటిక్ విజువల్స్తో భారీ స్థాయిలో ఉంది. తేజ సజ్జా, మంచు మనోజ్ ఒకరినొకరు ఢీ అంటే ఢీ అనేలా విధ్వంసం సృష్టించారు. తేజ చేతిలో ఓ స్పెషల్ పవర్‌తో కూడిన స్టిక్ ఉంటే, మనోజ్ చేతిలో పదునైన ఖడ్గం క్యూరియాసిటీని పెంచేశాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి భీభత్సం సృష్టించనుందో ఆసక్తి నెలకొంది.