Mirai Box Office: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘మిరాయ్’.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Mirai Box Office: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘మిరాయ్’.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

యంగ్ హీరో తేజ సజ్జా మిరాయ్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాడు. తెలుగు యాక్షన్‌ ఫాంటసీ మిరాయ్ పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో రోజు సైతం (సెప్టెంబర్ 13న) అదిరిపోయే వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. 

ఈ సందర్భంగా లేటెస్ట్గా మిరాయ్ సెకండ్ డే కలెక్షన్స్ ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి వసూళ్ల వివరాలు వెల్లడించారు. “సూపర్ యోధ సరిహద్దులను బద్దలు కొడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మిరాయ్ రెండో రోజుల్లో రూ.55.6 కోట్ల సాధించి జైత్రయాత్ర కొనసాగిస్తోంది’’ అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో వసూళ్ల వివరాలు తెలిపారు. 

సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం:  మిరాయ్ ఇండియాలో తొలిరోజు రూ.13 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు అంతకు మించిన వసూళ్లతో దూసుకెళ్లింది. శనివారం (సెప్టెంబర్ 13న) ఇండియాలో రూ.14.5 కోట్లు నెట్ సాధించి శభాష్ అనిపించుకుంది. రెండో రోజు కూడా తెలుగులోనే అత్యధిక వసూళ్లు చేసింది. దాదాపు రూ.11.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.

హిందీలో రూ.2.8 కోట్లు, తమిళంలో రూ.1 లక్ష, మలయాళంలో రూ.5 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు వచ్చాయి. ఇలా రెండ్రోజుల నెట్ వసూళ్లు చూస్తే.. ఇండియాలో రూ.27.5 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అలాగే, ఓవర్సీస్ మార్కెట్లో సైతం మిరాయ్ రికార్డ్ వసూళ్లు రాబడుతోంది.